పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన హోంమంత్రి

ABN , First Publish Date - 2020-06-19T16:59:58+05:30 IST

హైదరాబాద్: పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.

పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన హోంమంత్రి

హైదరాబాద్: పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు. 


ఈ స్టీల్ గేట్ అందుబాటులోకి రావడంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎల్వీ ప్రసాద్ మీదుగా పంజాగుట్ట వచ్చే వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. స్మశానంపై జీహెచ్ఎంసీ మొట్టమొదటిసారి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. లాక్‌డౌన్ సమయంలో అత్యంత వేగవంతంగా పనులు చేపట్టి ఈ ప్రాజెక్టును త్వరగా జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

Updated Date - 2020-06-19T16:59:58+05:30 IST