అన్యాయంగా ఇల్లు కూల్చేశారని కేసీఆర్‌కు చెప్పడానికెళ్లగా..

ABN , First Publish Date - 2020-12-17T12:51:31+05:30 IST

రెవెన్యూ అధికారులు అన్యాయంగా

అన్యాయంగా ఇల్లు కూల్చేశారని కేసీఆర్‌కు చెప్పడానికెళ్లగా..

హైదరాబాద్/బేగంపేట : రెవెన్యూ అధికారులు అన్యాయంగా నా ఇల్లు కూల్చేశారంటూ విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించేందుకు ప్రగతి భవన్‌కు వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు. బుధవారం సాయంత్రం 5.10 గంటలకు  షేక్‌పేటకు చెందిన షేక్‌ అబ్దుల్‌ వహాబ్‌ కొన్ని పత్రాలతో ప్రగతిభవన్‌ వద్దకు వచ్చాడు. బీబీ-4 గేట్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్‌పేటలో 70 గజాల స్ధలంలో ఇల్లు ఉందని, రెవెన్యూ అధికారులు ఇంటిని ఇటీవల కూల్చివేశారని, ముఖ్యమంత్రికి వివరించేందుకు వచ్చానని అతడు పోలీసులకు చెప్పాడు.  

Updated Date - 2020-12-17T12:51:31+05:30 IST