వికారాబాద్ జిల్లా పాలేపల్లి గ్రామంలో విషాదం

ABN , First Publish Date - 2020-06-04T05:30:00+05:30 IST

దోమ మండలం పాలేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. జగదీష్ (25)అనే యువకుడు గ్రామ శివారులో

వికారాబాద్ జిల్లా పాలేపల్లి గ్రామంలో విషాదం

వికారాబాద్: దోమ మండలం పాలేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. జగదీష్ (25)అనే యువకుడు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. జగదీష్ హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల లాక్‌డౌన్‌కు ముందు సొంతూరు వచ్చి పొలం పనులు చేసుకుంటున్నాడు. ఇంతలో ఏమైందో ఏమోగానీ ఈరోజు ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు.Updated Date - 2020-06-04T05:30:00+05:30 IST