"ప్రాణ"మిత్రులు సిటీ కాలేజీ అ"పూర్వ" విద్యార్థులు

ABN , First Publish Date - 2020-10-31T21:35:00+05:30 IST

ప్రాణం సైతం కాపాడేది స్నేహం అని నిరూపించిన ఘనత సిటీ కాలేజీ పూర్వ విద్యార్థులుగా తమ సొంతం ఆని, విద్యార్జన అనంతరం వ్యక్తులు ఎంత ఎత్తుకు ఎదిగినా.

హైదరాబాద్: ప్రాణం సైతం కాపాడేది స్నేహం అని నిరూపించిన ఘనత సిటీ కాలేజీ పూర్వ విద్యార్థులుగా తమ సొంతం ఆని, విద్యార్జన అనంతరం వ్యక్తులు ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎక్కడున్నా  వారందరినీ ఎల్లలు లేని ప్రేమ, వాత్సల్యం తో సేద తీరేలా చేసేది  స్వచ్ఛ మైన స్నేహమే అని తెలంగాణ పద్మశాలి అఫిషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. శనివారం ఆయన తన తో పాటు డిగ్రీ చదివిన ప్రభుత్వ నగర సిటీకాలేజీ సహాధ్యాయులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1995 లో బీఎస్సీ డిగ్రీ పాసయ్యక దాదాపు 60 మంది తెలంగాణా లో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు 25 సంవత్సరాల కాలం లో ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో వివిధ వృత్తుల్లో ఉన్నారని చెప్పారు. స్నేహ బంధం తో ప్రాణాలు సైతం కాపాడుకోవచ్చు అని నిరూపించిన గొప్ప శక్తి స్నేహానికే ఉందన్న విషయం తమ మిత్రత్వం నిరూపించిందన్నారు. వృక్షశాస్త్రం విద్యార్థులుగా  క్షేత్ర స్థాయి పర్యటన కోసం విశాఖ, అరకు సందర్శించిన అనుభవాలు తమ స్నేహ బంధాన్ని మరింత పెంచాయన్నారు. వనపర్తి ,గజ్వేల్ లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సత్యనారాయణ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, లెక్చరర్ గా ఉన్న రవీందర్ రెడ్డి లను 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఎంతో మధురానుభూతిని కలిగించిందన్నారు. 

Read more