ప్యాకేజీ-7 వ్యయం రూ.578 కోట్లు పెరుగుదల

ABN , First Publish Date - 2020-02-12T10:03:38+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ-7 అంచనా వ్యయాలు పెరిగాయి. పెరిగిన అంచనా వ్య యాలకు మంగళవారం నీటిపారుదల

ప్యాకేజీ-7 వ్యయం రూ.578 కోట్లు పెరుగుదల

ఆమోదం తెలిపిన ఎస్‌ఎల్‌ఎస్సీ 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ-7 అంచనా వ్యయాలు పెరిగాయి. పెరిగిన అంచనా వ్య యాలకు మంగళవారం నీటిపారుదల శాఖ స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్సీ) ఆమోదం తెలిపింది. ప్యాకేజీ-7 వాస్తవ అంచనా వ్యయం రూ.1502 కోట్లు ఉండగా, అది రూ.2080 కోట్లకు పెరిగింది. అంటే రూ.578 కోట్లు పెరిగింది. పెరిగిన భూ సేకరణ అవసరాలు, అదనపు నిర్మాణాలతో వ్యయం పెరిగినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు సీతారామలోని కొన్ని కొత్త పనులు ప్రస్తు తం ఉన్నటువంటి ఏజెన్సీలతోనే చేయించేందుకు ఎస్‌ఎల్‌ఎస్సీ ఆమోదం తెలిపింది.

Updated Date - 2020-02-12T10:03:38+05:30 IST