ఇల్లు ఖాళీ చేయాలంటూ గాంధీ వైద్యురాలికి వేధింపులు

ABN , First Publish Date - 2020-04-25T18:53:05+05:30 IST

ఇల్లు ఖాళీ చేయాలంటూ గాంధీ వైద్యురాలికి వేధింపులు

ఇల్లు ఖాళీ చేయాలంటూ గాంధీ వైద్యురాలికి వేధింపులు

హైదారాబాద్: గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలిని ఇల్లు ఖాళీ చేయాలంటూ హౌస్ ఓనర్ వేధింపులకు పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆమెను అసభ్య పదజాలంతో దూషించటంతో డాక్టర్ స్విగ్ధా పోలీసులను ఆశ్రయించారు. తన సామాగ్రి మొత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లమని వేధిస్తూ ఉండటంతో కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మంత్రి ఈటెల రాజేందర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఈటెల ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-04-25T18:53:05+05:30 IST