ఓపీఎస్‌కు అర్హులైన వారి జాబితాను పంపండి

ABN , First Publish Date - 2020-06-11T08:38:50+05:30 IST

ఓపీఎస్‌కు అర్హులైన వారి జాబితాను పంపండి

ఓపీఎస్‌కు అర్హులైన వారి జాబితాను పంపండి

ఏడీజీకి పోలీస్‌ అధికారుల సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): పాత పెన్షన్‌ విధానానికి(ఓపీఎ్‌సకు) అర్హులైన పోలీస్‌ సిబ్బంది జాబితాను ప్రభుత్వానికి అందజేయాలని అదనపు డీజీపీ(పరిపాలన) బి.శివధర్‌రెడ్డికి పోలీస్‌ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధులు బుధవారం ఏడీజీని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. పోలీస్‌ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న 800 మందికి ఓపీఎస్‌ వర్తింపజేయాలని ఏడీజీ శివధర్‌రెడ్డిని కోరారు. 

Updated Date - 2020-06-11T08:38:50+05:30 IST