నిర్మాణ కార్మికులను ఆదుకోండి: విపక్షాలు

ABN , First Publish Date - 2020-05-13T09:29:52+05:30 IST

నిర్మాణ కార్మికులను ఆదుకోండి: విపక్షాలు

నిర్మాణ కార్మికులను ఆదుకోండి: విపక్షాలు

హైదరాబాద్‌/చిక్కడపల్లి, మే 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని విపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు రూ.5 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ అహ్మద్‌ నదీంను కలిసి వినతిపత్రం ఇచ్చారు.   

Read more