ఓపెన్‌ స్కూల్‌ ఉత్తీర్ణతపై జీవో జారీ

ABN , First Publish Date - 2020-07-28T08:40:16+05:30 IST

కరోనా నేపథ్యంలో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌, మేలో పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్

ఓపెన్‌ స్కూల్‌ ఉత్తీర్ణతపై జీవో జారీ

హైదరాబాద్‌సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌, మేలో పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ వెంకటనర్సమ్మ తెలిపారు. ఈ మేరకు పదోతరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్లు ఉత్తీర్ణత విషయంలో విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2020-07-28T08:40:16+05:30 IST