ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-12-11T04:33:19+05:30 IST

ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, డిసెంబరు 10: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో కె.నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

గురువారం నుంచి జనవరి 15 వరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు సమీప ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాలు గల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రిన్సిపాళ్లను సంప్రదించి ప్రవేశాలు పొందాలని కోరారు. దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ మురాల శంకర్‌రావు ఒక ప్రకటనలో కోరారు. 

మీసేవా, టీఎస్‌, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలోని ఎంఈవోలు, అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రవేశాలను అధిక సంఖ్యలో చేయించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలకు ఠీఠీఠీ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చౌఞ్ఛుఽటఛిజిౌౌజూ.ౌటజ వెబ్‌సైట్‌లో చూడాలని వారు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-11T04:33:19+05:30 IST