లివరీ వస్త్రాల కూలీ రేటు పెంపు

ABN , First Publish Date - 2020-07-19T08:35:04+05:30 IST

చేనేత కార్మికులకు స్వల్ప ఊరట. లివరీ వస్త్రాల తయారీపై కూలీ రేట్లను సుమారు 50 శాతం పెంచారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి సర్క్యులర్‌ను...

లివరీ వస్త్రాల కూలీ రేటు పెంపు

హైదరాబాద్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు స్వల్ప ఊరట. లివరీ వస్త్రాల తయారీపై కూలీ రేట్లను సుమారు 50 శాతం పెంచారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి సర్క్యులర్‌ను జారీ చేశారు. కూలీ రేట్లను పెంచాలని ఆప్కో మాజీ చైర్మన్‌ మండల శ్రీరాములు గతంలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రాలను చేనేత సంఘాల ద్వారా టెస్కో సేకరిస్తోంది. పెంచిన కూలీ రేట్లతో రూ.2.69 కోట్లు మేర భారం పడనుంది.

Updated Date - 2020-07-19T08:35:04+05:30 IST