రాజకీయాల్లో శత్రువులు ఉండరు : ఊమెన్‌చాందీ

ABN , First Publish Date - 2020-09-24T13:20:24+05:30 IST

రాజకీయాల్లో నాయకులకు మిత్రులే ఉంటారు, శత్రువులు ఎవరూ ఉండరని

రాజకీయాల్లో శత్రువులు ఉండరు : ఊమెన్‌చాందీ

హైదరాబాద్/బేగంపేట : రాజకీయాల్లో నాయకులకు మిత్రులే ఉంటారు, శత్రువులు ఎవరూ ఉండరని కేరళ మాజీ సీఎం ఊమెన్‌చాందీ అన్నారు. మంగళవారం రాత్రి బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో మలయాళం తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శాసన సభలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఊమెన్‌చాందీకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఊమెన్‌చాందీ 50 నాట్‌ అవుట్‌ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మలయాళం తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు హాజరై ఊమెన్‌చాందీని సన్మానించారు.


 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమర్శలను సహృదయంతో స్వీకరించాలన్నారు. ఒక నిజమైన రాజకీయ నాయకుడిని శత్రువులు ఓడించలే రన్నారు. సొంత పార్టీ నాయకులు, కుటుంబ సభ్యుల వల్లే వారు ఓడిపోతారన్నారు. పొగడ్తలకు పొంగిపోతే ఆ నాయకుల పతనం ప్రారంభమైనట్లేనన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు బెంజిమెన్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T13:20:24+05:30 IST