అంత్యక్రియలు జరిగే చోట 50 మందికే అనుమతి

ABN , First Publish Date - 2020-06-18T16:32:07+05:30 IST

భారత్, చైనా సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్‌బాబు..

అంత్యక్రియలు జరిగే చోట 50 మందికే అనుమతి

సూర్యాపేట: భారత్, చైనా సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్‌బాబు భౌతికాయానికి గురువారం సూర్యాపేటలోని కేసారం‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రామానికి 50 మందికి మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. సంతోష్‌బాబు కుటుంబసభ్యులు, ఆర్మీ అధికారులు మాత్రమే హాజరవుతారు.  సైనిక లాంఛనాలతో అంతిమసంస్కారాలు నిర్వహించనున్నారు. ఆర్మీ అధికారి సుబేదార్ దినేష్ కుమార్ సూర్యపేటకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతిమయాత్రకు వచ్చేవాళ్లు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2020-06-18T16:32:07+05:30 IST