ఆన్‌లోన్‌ దోపిడీ

ABN , First Publish Date - 2020-12-28T06:20:33+05:30 IST

ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్స్‌తో రుణాలు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

ఆన్‌లోన్‌ దోపిడీ

ఇన్‌స్టంట్‌ లోన్‌యా్‌పతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్టు  
బెంగళూరు కేంద్రంగా అక్రమ దందా

వరంగల్‌ అర్బన్‌ క్రైం, డిసెంబరు 27:
ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్స్‌తో రుణాలు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌ట్యా్‌పలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ వివరాల ప్రకారం.. నార్త్‌ బెంగళూరు చిక్కాబన్స్‌వాడకు చెందిన దేబాశివ్‌దాస్‌, బెంగళూరు ఫలిమాకు చెందిన సంజయ్‌ బీఆర్‌, బెంగుళూరు నీల్‌సంద్రాకు చెందిన సంతో్‌షకుమార్‌ నాయక్‌లతో పాటు పరారీలో ఉన్న చైనా దేశానికి చెందిన ఎర్రీక్‌ పెంగ్లూ ఒడిశా రాష్ట్రానికి చెందిన పాడ్రా బిందారాయ్‌లు ఆన్‌లైన్‌ యాప్స్‌ ద్వారా రుణాలు అందిస్తారు.  2019లో ఎర్రీక్‌ పెండ్లూ వ్యాపార వీసాపై వచ్చి ఒడిశాలో ఉన్న పాడ్రాబిందారాయ్‌ని కలుపుకుని ఐదు ఇన్‌స్టంట్‌ యాప్‌లను రూపొందించారు. బెంగళూరు కేంద్రంగా షైన్‌బే టెక్రాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దేబాశి్‌సదాస్‌, సంజయ్‌, సంతో్‌షకుమార్‌ సహకారంతో ఫాస్ట్‌ క్రెడిట్‌ యాప్‌ల ద్వారా ఇన్‌స్టంట్‌ లోన్‌ రుణాలు మంజూరు చేస్తారు. సామాన్యులకు, డబ్బు తిరిగి చెల్లించడంతో జాప్యం చేసే వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో జనగామ జిల్లా గుడ్లగడ్డకు చెందిన  బంగారు శ్రీనివాస్‌ క్రెడిట్‌ కార్డుతో యాప్‌ ద్వారా రూ.4వేల రుణం తీసుకున్నాడు. అధిక వడ్డీ వేసి డబ్బులు తిరిగి చెల్లించాలని వివిధ ఫోన్‌ నెంబర్ల నుంచి చాలాసార్లు కాల్‌ చేసి  వేధింపులకు గురిచేశారు. ఈ వేధింపులు భరించలేక శ్రీనివాస్‌ ఈనెల 18న జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తులు బెంగళూరులో ఉన్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో బెంగళూరులో దేబాశిశ్‌దాస్‌, సంజయ్‌ బీఆర్‌, సంతో్‌షకుమార్‌ నాయక్‌లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు వ్యక్తులు ఎర్రీక్‌పెంగ్లూ, పాండ్రాబిన్‌దారాయ్‌లు పోలీసులను చూసి పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురిని విచారించగా చేసిన తప్పును ఒప్పుకున్నారు.  నిందితులను సకాలంలో అరెస్టు చేసిన జనగామ సీఐ మల్లేశ్‌, సైబర్‌క్రైం సీఐ జనార్దన్‌రెడ్డి, జనగామ సైబర్‌ ఎస్సైలు రవీందర్‌, సతీష్‌, ఏఏవో ప్రశాంత్‌, క్రైం సిబ్బంది రాజు, కిశోర్‌, జకీర్‌ను సీపీ ప్రమోద్‌కుమార్‌ అభినందించారు.

Updated Date - 2020-12-28T06:20:33+05:30 IST