నేటి నుంచి ఆన్‌లైన్‌లో జీకాట్‌ సదస్సు

ABN , First Publish Date - 2020-10-01T08:39:18+05:30 IST

గ్రామోదయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ(జీకాట్‌) గురువారం నుంచి మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో సదస్సును నిర్వహిస్తోంది. దీనికి గవర్నర్‌ తమిళిసై....

నేటి నుంచి ఆన్‌లైన్‌లో జీకాట్‌ సదస్సు

హైదరాబాద్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): గ్రామోదయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ(జీకాట్‌) గురువారం నుంచి మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో సదస్సును నిర్వహిస్తోంది. దీనికి గవర్నర్‌ తమిళిసై, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాస్‌ చౌదరి హాజరవుతారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మహాత్మగాంఽధీ 150వ జయంతి సందర్భంగా గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేస్తున్న 20మందికి గ్రామోదయ బంధుమిత్ర పురస్కారాలను అందజేస్తామని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు కొందరు 2017లో జీకాట్‌ను ఏర్పాటు చేశారు.  

Updated Date - 2020-10-01T08:39:18+05:30 IST