రక్షణపై ట్రాన్స్‌కో ఉద్యోగులకు ఆన్‌లైన్‌లో శిక్షణ
ABN , First Publish Date - 2020-09-20T08:19:40+05:30 IST
విద్యుత్ ప్రమాదాలతో ట్రాన్స్‌కో అప్రమత్తమైంది. ప్రమాదాల నివారణకు, రక్షణ పద్ధతులపై ఉద్యోగులకు ట్రాన్స్‌కో ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనుంది.

హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ ప్రమాదాలతో ట్రాన్స్‌కో అప్రమత్తమైంది. ప్రమాదాల నివారణకు, రక్షణ పద్ధతులపై ఉద్యోగులకు ట్రాన్స్‌కో ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనుంది. ఎక్స్‌ట్రా హై వోల్టేజీ సబ్‌స్టేషన్లలో పనిచేసే వారితో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు, గ్రేడ్-1, గ్రేడ్-2 ఆర్టిజన్లకు ఈ శిక్షణ ను ఇవ్వనున్నారు.
రక్షణ, నిర్వహణ, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఏవిధంగా సరఫరా వ్యవస్థను పునరుద్ధరించాలి వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. దీని కోసం కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (సీటీఐ) కూడా టీఎస్-స్మార్ట్ పేరుతో ఆన్‌లైన్ శిక్షణకు మాడ్యూల్‌ను సిద్ధం చేసింది.