ఫిర్యాదు చేద్దామన్నా.. మోసమే!

ABN , First Publish Date - 2020-11-25T07:20:48+05:30 IST

ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు సూచిస్తున్నా సైబర్‌ నేరగాళ్లు ఏదో ఒక కొత్త అవతారమెత్తి అమాయకుల

ఫిర్యాదు చేద్దామన్నా.. మోసమే!

 ఆన్‌లైన్‌ మోసగాళ్ల తాజా ఎత్తుగడ

హైదరాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు సూచిస్తున్నా సైబర్‌ నేరగాళ్లు ఏదో ఒక కొత్త అవతారమెత్తి అమాయకుల ఖాతాలు కొల్లగొడుతున్నారు. సైబర్‌ నేరగాళ్ల బారిన పడ్డవారు ఆన్‌లైన్‌లో పోలీసులకు పిర్యాదు చేద్దామంటే ఇప్పుడు అక్కడికీవచ్చి చేరారు. సైబర్‌ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ సైబర్‌ క్రైం పోలీసులు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. ఠీఠీఠీ.ఛిడఛ్ఛటఛిటజీఝ్ఛ.www.cybercrime.gov.in    వెబ్‌సైట్‌ ద్వారా బాధితులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది.


కానీ సైబర్‌ నేరగాళ్లు www.jancybersurakshakendra.com పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ తయారు చేశారు. సైబర్‌ నేరాల బారినపడ్డ వారు ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సెర్చ్‌ చేస్తే నకిలీ వెబ్‌సైట్‌ దర్శనమిస్తోంది. ఆకట్టుకునేలా, అధికారిక వెబ్‌సైట్‌ మాదిరిగా ఉండటంతో చాలా మంది బాధితులు అసలు వెబ్‌సైట్‌గా భావించి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదుల స్వీకరణకు ఫీజు వసూలు చేసి సైబర్‌ నేరగాళ్లు ఇక్కడా మోసానికి పాల్పడుతున్నారు. ప్రజలు నకిలీ వెబ్‌సైట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, టోల్‌ఫ్రీ నంబరు 155260కు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచించారు.


Updated Date - 2020-11-25T07:20:48+05:30 IST