అన్న‌దాత‌ల‌కు ఆన్‌లైన్ వ్య‌వ‌సాయ క‌న్స‌ల్టేష‌న్

ABN , First Publish Date - 2020-07-18T23:40:44+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలోని అన్న‌దాత‌లు వ్య‌వ‌సాయంలో కొత్త పుంత‌లు తొక్కేలా తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) రూపొందించిన

అన్న‌దాత‌ల‌కు ఆన్‌లైన్ వ్య‌వ‌సాయ క‌న్స‌ల్టేష‌న్

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని అన్న‌దాత‌లు వ్య‌వ‌సాయంలో కొత్త పుంత‌లు తొక్కేలా తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) రూపొందించిన టి.క‌న్స‌ల్ట్ యాప్ వినూత్న సౌల‌భ్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. వ్య‌వ‌సాయంలోని అన్ని స‌మ‌స్య‌ల‌పై స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌, తాజా ప‌రిస్థితుల వివ‌రాలు, స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు పొందేందుకు శాస్త్రవేత్త‌ రైతుల‌కు అనుసంధానం చేసేలా టి.క‌న్స‌ల్ట్ స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్ప‌టికే తెలంగాణ వ్య‌వ‌సాయ వ‌ర్సిటీ శాస్త్రవేత్త‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక మండలం నిర్వ‌హించిన అనంత‌రం విదేశాల్లోని నిపుణుల‌తోనూ మ‌న రైతుల‌ను అనుసంధానం చేసేందుకు కృషి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి స్వ‌యంగా నిపుణుల‌తో అనుసంధానమయ్యారు. ఈ యాప్‌కు సంబంధించి తొలి వినియోగ‌దారుడిగా మారి తెలంగాణ వ్య‌వ‌సాయ వ‌ర్సిటీ మాజీ రిజిస్ట్రార్, రిటైర్డ్ ప్రొఫెస‌ర్ జ‌లప‌తిరావుతో టి.క‌న్స‌ల్ట్ ద్వారా రైతుల‌కు సంబంధించిన సందేహాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నిరంజ‌న్‌రెడ్డి టీటా కృషిని కొనియాడారు. మ‌రింత‌గా రైతుల‌కు చేరువ కావాల‌ని ఆకాంక్షించారు.

Updated Date - 2020-07-18T23:40:44+05:30 IST