పటాన్‌చెరులో ఉల్లి మార్కెట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-28T10:47:06+05:30 IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీకృత మార్కెట్‌ ఆవరణలో ఉల్లిగడ్డల హోల్‌సేల్‌ మార్కెట్‌ యార్డ్‌ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.

పటాన్‌చెరులో ఉల్లి మార్కెట్‌ ప్రారంభం

రూ.60కోట్లతో ఆధునికీకరిస్తాం: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి


పటాన్‌చెరు, ఏప్రి ల్‌ 27: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీకృత మార్కెట్‌ ఆవరణలో ఉల్లిగడ్డల హోల్‌సేల్‌ మార్కెట్‌ యార్డ్‌ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మలక్‌పేటలోని ఉల్లిగడ్డల హోల్‌సేల్‌ మార్కెట్‌ను దశలవారీగా పటాన్‌చెరుకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సమీకృత మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలోనే ఉల్లిగడ్డల మార్కెట్‌ను ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని పేర్కొన్నారు.  నాబార్డ్‌ ద్వారా మంజూరైన రూ.60 కోట్ల నిధులతో మార్కెట్‌ను ఆధునికీకరిస్తామని తెలిపారు. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2020-04-28T10:47:06+05:30 IST