గాంధీలో కొనసాగుతున్న సిబ్బంది ఆందోళన

ABN , First Publish Date - 2020-07-15T20:46:07+05:30 IST

గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఆందోళన కొనసాగుతోంది.

గాంధీలో కొనసాగుతున్న సిబ్బంది ఆందోళన

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఆందోళన కొనసాగుతోంది. జీతాలు పెంచి తమను రెగ్యులరైజ్ చేయాలని ఔట్ సోర్సింగ్ నర్సులు డ్యూటీలకు హాజరుకావడంలేదు. ఇప్పుడు నాలుగో తరగతి ఉద్యోగులు కూడా ఆందోళన బాటపట్టారు. సిబ్బంది నిరసనలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గాంధీలో నర్సులు, నాలుగోతరగతి సిబ్బంది ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. కొత్తగా తీసుకునేవాళ్లకు ఎక్కువ జీతం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు జీతాలు పెంచాలని, ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-07-15T20:46:07+05:30 IST