ఒకేసారి 1500 మంది రోగుల చికిత్సకు సిద్ధంకండి

ABN , First Publish Date - 2020-05-29T09:07:16+05:30 IST

లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని, ఈ నేపథ్యంలో వైద్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. ఒకేసారి 1,500 మంది రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా

ఒకేసారి 1500 మంది రోగుల చికిత్సకు సిద్ధంకండి

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని, ఈ నేపథ్యంలో వైద్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. ఒకేసారి 1,500 మంది రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని, ఇందుకు ఏం కావాలో అడగాలని వైద్యులను కోరారు. అవసరమైన వైద్య సిబ్బంది, డయాగ్నోస్టిక్స్‌, మందులు తదితరాలపై నివేదిక సమర్పించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావును ఆదేశించారు. కరోనా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో గాంధీ ఆస్పత్రి వైద్యులు, మెడికల్‌ అడ్వైజరీ బోర్డుతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా రోగుల్లో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారు మాత్రమే చనిపోతున్నారని, మిగిలిన వారు కోలుకుని క్షేమంగా ఇంటికి వెళుతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఫీవర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈటల తెలిపారు.

Updated Date - 2020-05-29T09:07:16+05:30 IST