లక్నవరం సరస్సులో ఒకరి గల్లంతు

ABN , First Publish Date - 2020-12-26T04:55:41+05:30 IST

లక్నవరం సరస్సులో ఒకరి గల్లంతు

లక్నవరం సరస్సులో ఒకరి గల్లంతు

గోవిందరావుపేట, డిసెంబరు 25 : మండలంలోని బుస్సాపూర్‌ సమీపంలో ఉన్న లక్నవరం సరస్సు సందర్శనకు వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నీటిలో గల్లంతయ్యాడు. హైదరబాద్‌లోని మియాపూర్‌ ఇండస్ర్టీయల్‌ ప్రాంతానికి చెందిన 18 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు శుక్రవారం లక్నవరం సందర్శనకు రాగా వారిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఉల్లూరి సుధాకర్‌ (22) ఈత కొట్టేందుకు సరస్సులోకి దిగాడు. ఈతకొడుతున్న క్రమంలో సుధాకర్‌ నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న పస్రా ఎస్సై రవీందర్‌ సిబ్బందితో సరస్సు వద్దకు చేరుకుని యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


Updated Date - 2020-12-26T04:55:41+05:30 IST