మరో ప్రేమ జంట విలవిల

ABN , First Publish Date - 2020-09-29T07:21:46+05:30 IST

పెద్దలను కాదని పెళ్లి చేసుకున్న ఒక ప్రేమ జంట వేధింపులతో విలవిల్లాడింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం గవిచర్లకు చెందిన బాసిపాక శివ, వర్ధన్నపేటకు చెందిన రూపలక్ష్మి ఆరేళ్లుగా

మరో ప్రేమ జంట విలవిల

సంగెం, సెప్టెంబరు 28: పెద్దలను కాదని పెళ్లి చేసుకున్న ఒక ప్రేమ జంట వేధింపులతో విలవిల్లాడింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం గవిచర్లకు చెందిన బాసిపాక శివ, వర్ధన్నపేటకు చెందిన రూపలక్ష్మి ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. ఒకే సామాజిక వర్గానికే చెందినా.. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. గత నెల 29న గవిచర్లలోని శ్రీరామలింగేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అదే గ్రామంలో నివాసం ఉంటున్నారు.  ఈ నెల 26న రాత్రి తల్లిదండ్రులతో సహా 11మంది రూపలక్ష్మి ఇంటికి వెళ్లారు. శివ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కారంపొడి చల్లి.. అమ్మాయిని బలవంతంగా తీసువెళ్లారు. దీంతో సంగెం పోలీసులకు శివ ఫిర్యాదు చేశాడు. దాడికి దిగిన వారిపై ఎస్సై సురేష్‌ కేసు నమోదు చేశారు. అమ్మాయిని కొత్తగూడెంలో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను తీసుకొచ్చి భర్త వద్దకు చేర్చారు.

Updated Date - 2020-09-29T07:21:46+05:30 IST