గోదావరిలో దూకి సీఏ పట్టభద్రుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-05-24T08:00:55+05:30 IST

చక్కగా చార్టడ్‌ అకౌంటెన్సీ(సీఏ) చదువుకున్నాడు. తెలివితేటలున్నవాడు. కానీ ఏడాదిగా ప్రయత్నిస్తున్నా ఉద్యోగం..

గోదావరిలో దూకి సీఏ పట్టభద్రుడి ఆత్మహత్య

దండేపల్లి, మే 23: చక్కగా చార్టడ్‌ అకౌంటెన్సీ(సీఏ) చదువుకున్నాడు. తెలివితేటలున్నవాడు. కానీ ఏడాదిగా ప్రయత్నిస్తున్నా ఉద్యోగం సాధించలేకపోయాడు. తాను నిరుద్యోగిగా మిగిలిపోయానన్న ఆవేదనతో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలోని పడ్తన్‌పల్లిలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వినీత్‌రావు(25) గురువారం తన అమ్మమ్మగారింటికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. అక్కడికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం దండేపల్లి మండలంలోని గోదావరిలో ఓ మృతదేహం కొట్టుకురావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అది వినీత్‌దేనని అతడి కుటుంబసభ్యులు ధ్రువీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-05-24T08:00:55+05:30 IST