పీఆర్‌టీయూటీఎస్‌ ఒక రోజు వేతనం విరాళం

ABN , First Publish Date - 2020-03-24T10:19:54+05:30 IST

పీఆర్‌టీయూటీఎస్‌ ఒక రోజు వేతనం విరాళం

పీఆర్‌టీయూటీఎస్‌ ఒక రోజు వేతనం విరాళం

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు మద్దతుగా ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ యూనియన్‌ తెలంగాణ స్టేట్‌ సంఘం సభ్యులు మార్చిలో ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌ రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. తద్వారా రూ.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది.  

Read more