తెలంగాణ సచివాలయం కూల్చివేతపై మరోసారి విచారణ

ABN , First Publish Date - 2020-07-15T17:53:43+05:30 IST

సచివాలయం కూల్చివేతపై బుధవారం హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై మరోసారి విచారణ

హైదరాబాద్: సచివాలయం కూల్చివేతపై బుధవారం హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. భవనాల కూల్చివేత ద్వారా 5 లక్షల మందికి శ్వాస ఇబ్బందులు ఎదురవవుతాయని ప్రొఫెసర్ విశ్వేశ్వర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అన్ని అనుమతులు తీసుకుని సచివాలయ భవనాల కూల్చివేత పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కేబినెట్ తీసుకున్న ఫైనల్ రిపోర్టు కాపీని సీల్డు కవరులో ఏజీ కోర్టుకు సమర్పించారు.


25 ఎకరాల్లో ఉన్న సచివాలయంలో 11 బ్లాకులు ఉన్నాయని ఇందులో ఎలాంటి ఫైర్ సెప్టీ లేదని అఫిడవిట్‌లో ఏజీ పేర్కొన్నారు. 132 ఏళ్ల క్రితం నిజాం నిర్మించిన భవనాల లక్ష టన్నుల వ్యర్థాలు పాడైపోయిన స్థితిలో ఉన్నాయని చెప్పారు. కూల్చివేతకు అత్యాధునిక యంత్రాలు ఉపయోగిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు.

Updated Date - 2020-07-15T17:53:43+05:30 IST