ఆర్టీఏ వెబ్‌సైట్‌లో.. ఫోన్‌ నంబర్‌ మార్చుకోవచ్చు

ABN , First Publish Date - 2020-09-13T06:33:30+05:30 IST

వాహనదారులు ఆర్టీఏ వెబ్‌సైట్‌లో తమ వాహనానికి, డ్రైవింగ్‌ లైసెన్సుకు సంబంధించి ఫోన్‌ నంబర్‌ను మార్చుకోవచ్చు.

ఆర్టీఏ వెబ్‌సైట్‌లో.. ఫోన్‌ నంబర్‌ మార్చుకోవచ్చు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 12 (ఆంరఽధజ్యోతి): వాహనదారులు ఆర్టీఏ వెబ్‌సైట్‌లో తమ వాహనానికి, డ్రైవింగ్‌ లైసెన్సుకు సంబంధించి ఫోన్‌ నంబర్‌ను మార్చుకోవచ్చు. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు ప్రత్యేక సదుపాయాన్ని కల్పించారు.

ఇందుకు transport.telangana.gov.in  వెబ్‌సైట్‌లో.. కుడివైపు ‘సైడ్‌బార్‌’లో ఉండే ‘అప్‌డేట్‌ యువర్‌ మొబైల్‌ నంబర్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ‘‘చాలా వాహనాలకు మొబైల్‌ నంబర్లను జతచేయకపోవడం వల్ల ఈ-చలానాల వివరాలు వారికి అందడం లేదు. ప్రతి వాహనదారుడు తమ మొబైల్‌ నంబరును అప్‌డేట్‌ చేసుకోవాలి’’ అని హైదరాబాద్‌ నగర పోలీసు అదనపు కమిషనర్‌ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ కోరారు.


Updated Date - 2020-09-13T06:33:30+05:30 IST