ఆస్పత్రిలో కుప్పకూలిన సీలింగ్‌

ABN , First Publish Date - 2020-08-18T07:16:48+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున నవజాత శిశువుల వార్డులో సీలింగ్

ఆస్పత్రిలో కుప్పకూలిన సీలింగ్‌

బోధన్‌, ఆగస్టు 17: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున నవజాత శిశువుల వార్డులో సీలింగ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, విలువైన యంత్ర సామగ్రికి మాత్రం నష్టం వాటిల్లింది. సంవత్సరం క్రితమే లక్షలాది రూపాయలతో ఈ వార్డును ఆధునికీకరించారు. కేవలం 3 రోజులు కురిసిన వర్షాలకే సీలింగ్‌ కుప్పకూలడం విస్మయం కలిగిస్తోంది. 

Updated Date - 2020-08-18T07:16:48+05:30 IST