వైద్యం వికటించి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-28T04:31:56+05:30 IST

వైద్యం వికటించి వ్యక్తి మృతి

వైద్యం వికటించి వ్యక్తి మృతి
నెక్కొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వద్ద ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులు

నెక్కొండ, డిసెంబరు 27: వైద్యం వికటించడంతో వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం. పర్వతగిరి మండలం దౌలత్‌నగర్‌కు చెందిన లింగయ్య (65) అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 26న నెక్కొండలో ని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందిన అనంతరం ఇంటికి వెళ్లగా ఆదివారం మృతి చెందాడు. వైద్యం వికటించడంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులతో  కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై నాగరాజు అక్కడికి  చేరుకుని వారిని శాంతింపజేశారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చట్టపరంగాచర్యలు తీసుకుంటామని ఎస్సై వారి స్పష్టం చేశారు. అయితే వారు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఎస్సై తెలిపారు. సంఘటకు సంబంధించి వివరాలు తెలుపడానికి ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో లేరు. 


Updated Date - 2020-12-28T04:31:56+05:30 IST