ఓల్డ్ మలక్‌పేట్ రీపోలింగ్ అప్‌డేట్...

ABN , First Publish Date - 2020-12-03T16:10:48+05:30 IST

హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట్ రీపోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను నగర అదనపు పోలీసు కమిషనర్ చాహర్ పరిశీలించారు.

ఓల్డ్ మలక్‌పేట్ రీపోలింగ్ అప్‌డేట్...

హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట్ రీపోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను నగర అదనపు పోలీసు కమిషనర్ చాహర్ పరిశీలించారు. ఉదయం 9 గంటల వరకు 4.44 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 69 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ రీపోలింగ్ కొనసాగుతోంది. క్విక్ రియాక్షన్ టీం అందుబాటులో ఉంది. స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీ పోలీస్, ఆర్మ్ రిజర్వ్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.


Updated Date - 2020-12-03T16:10:48+05:30 IST