తెలంగాణలో భారీఎత్తున ఆయిల్‌పామ్‌ సాగుకు నిర్ణయం

ABN , First Publish Date - 2020-06-23T19:51:20+05:30 IST

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ సాగును భారీఎత్తున విస్తరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో భారీఎత్తున ఆయిల్‌పామ్‌ సాగుకు నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ సాగును భారీఎత్తున విస్తరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలు, నిర్మల్‌, మంచిర్యాల, మహబూబాబాద్‌ తదితర జిల్లాల్లో 2,717 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆయిల్‌పామ్‌ అడ్డయిజరీ కమిటీ సమావేశంలో ఈనిర్ణయం తీసుకున్నారు. ఆయా జిల్లాల్లో సుమారు 1000 ఎకరాలకు పరిపాలనా అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. డ్రిప్‌సౌకర్యం కల్పించడం, మొక్కలు నాటడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 98 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కలను నాటినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన నేషనల్‌ఫుడ్‌సెక్యూరిటీ మిషన్‌, ఆయిల్‌ పామ్‌ ద్వారా అమలు చేస్తున్నారు. 


ఒక ఎకరా ఆయిల్‌పామ్‌ సాగు చేసేందుకు మొదటి నాలుగు సంవత్సరాలకు గాను సుమారు 60వేల నుంచి 70వేల రూపాయల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నారు. నాలుగు సంవత్సరాలకు 30,800 రూపాయలు రాయితీ ద్వారా లభిస్తుందని అధికారులు తెఇలపారు. కేటాయించిన కంపెనీల ద్వారా రైతులకు మొక్కలు, మొదటి నాలుగు సంవత్సరాలపాటు ఎరువులు సరఫరా చేస్తారు. ఈ సందర్భంగా కొత్తగా నోటిఫై చేసిన జిలల్లాల్లో ఆయిల్‌పామ్‌ పంటవల్ల కలిగే లాభాలను దృష్టిలో ఉంచుకుని సంవత్సరం పొడవునా నీటి సౌకర్యం ఉన్న రైతులందరు ఈ పంట సాగు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. 

Read more