రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. జంతు కళేబరాలతో నూనె తయారీ

ABN , First Publish Date - 2020-03-02T18:14:13+05:30 IST

రంగారెడ్డి: స్థానికుల చొరవతో ప్రాణాంతకమైన దందా ఒకటి వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో తిమ్మాపూర్‌లోని హరి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో..

రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. జంతు కళేబరాలతో నూనె తయారీ

రంగారెడ్డి: స్థానికుల చొరవతో ప్రాణాంతకమైన దందా ఒకటి వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో తిమ్మాపూర్‌లోని హరి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జంతు కళేబరాలను, చనిపోయిన పందుల కళేబరాలతో కల్తీ నూనెను తయారు చేస్తున్నారు. పరిశ్రమ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో భరించలేక స్థానికులు పరిశ్రమలోకి వెళ్లి వాళ్ల బండారం బయట పెట్టారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-03-02T18:14:13+05:30 IST