గోదారి ఉగ్రరూపం- ములుగులోని గ్రామాలకు ముంపు ముప్పు

ABN , First Publish Date - 2020-08-17T00:09:10+05:30 IST

గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలో పరిస్థితులు కొంత ఇబ్బంది కరంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

గోదారి ఉగ్రరూపం- ములుగులోని గ్రామాలకు ముంపు ముప్పు

వరంగల్‌: గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలో పరిస్థితులు కొంత ఇబ్బంది కరంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గోదావరి ఆఖరు ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిందని ఆయా ప్రాంతాల్లో పర్యటించిన పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు వెల్లడించారు. కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ పోయిందన్నారు. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం కంతనపల్లి, ఏటూరు నాగారం చుట్టుపక్కల రామన్నగూడెం వంటి పల్లెలు, మంగపేట మండలం కట్టిగూడెం, దేవనగర్‌ వాడగూడెం , పొదుమూరు వంటి గ్రామాల ప్రజలను ఆదుకోవడానికి అన్నిఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి కలెక్టర్‌, ఐటిడీఏ పీవోను ఆదేశించారు. 

సీఎం కేసీఆర్‌ ఆరా

కాగా వరద ముంపు పరిస్థితుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఫోన్‌చేసి ఆరా తీస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే తీసుకోవాలని, అందరినీ ఆదుకోవాలని ఆదేశించారని అన్నారు. జాతీయ విపత్తుల నివారణ టీములను రప్పిస్తున్నట్టు తెలిపారు. వరద బాఽధితులను ఆదుకోవడానికి 24గంటలూ అందుబాటులో ఉంటున్నామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ప్రజలు మూడరోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందే ఇండ్లు ఖాళీ చేయండి. పునరావాస కేంద్రాలకు చేరాలని విజ్ఞప్తిచేశారు.


అన్నిరకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కలెక్టర్లతో పాటు అన్నిశాఖల అధికారలుఉ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు మంత్రి ఎర్రబెల్లి తెఇపారు. ఏ సమస్య వచ్చినా తనకు కానీ, మంత్రి సత్యవతి రాథోడ్‌ దృష్టికి తీసుకు రావాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-08-17T00:09:10+05:30 IST