అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ABN , First Publish Date - 2020-03-13T11:52:25+05:30 IST
వర్ధన్నపేట మునిసిపాలిటీ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరిత అన్నారు.

జిల్లా కలెక్టర్ హరిత
వర్ధన్నపేట, మార్చి 12: వర్ధన్నపేట మునిసిపాలిటీ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరిత అన్నారు. గురువారం వర్ధన్నపేట మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో చైర్‌పర్సన్ ఆంగోత్ అరుణ అధ్యక్షతన జరిగిన మునిసిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే అరూరి రమేష్., కలెక్టర్ హరిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యలోపం లేకుం డా కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్‌లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు.
ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ మునిసిపాలిటీలో 12 వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సీసీరోడ్లు, సైడుకాలువలు, తాగునీరు, సాగునీరుకు ఏవిధమైన లోటులేకుండా ప్రతీ అవసరత తీర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్, వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు తొటకూరి రాజమని ప్రసాద్, తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, సమ్మెట సుధీర్, పూజారి సుజాత, కొండేటి అనిత, పాలకుర్తి సుజాత, కోదాటి పద్మదేవేందర్‌రావు, భూక్యా సరిత, బానోత్ అనిత తదితరులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.