ఉపాధ్యాయుల ఆశీస్సులు ప్రతి విద్యార్ధి ఉన్నతికి దీవెనలు

ABN , First Publish Date - 2020-09-06T01:03:29+05:30 IST

ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆశీస్సులు ప్రతి విద్యార్ధి ఉన్నతికి దీవెనలని, వారి జీవితాల్లో వెలుగులను నింపే దివ్వెలని తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్‌ అన్నారు.

ఉపాధ్యాయుల ఆశీస్సులు ప్రతి విద్యార్ధి ఉన్నతికి దీవెనలు

హైదరాబాద్‌: ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆశీస్సులు ప్రతి విద్యార్ధి ఉన్నతికి దీవెనలని, వారి జీవితాల్లో వెలుగులను నింపే దివ్వెలని తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్‌ అన్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరో సహచరుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తమకు చిన్నతనంలో పాఠాలు చెప్పిన అధ్యాపకులు, బేగంపేట మహిళా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జానకిని శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో కలిశారు. ఈసందర్భంగా చేనేత వస్ర్తాలతో సత్కరించారు. అత్యుత్తమ గురుభావంతో ఆమెకు పాదాభివందనం చేశారు. ఈసందర్భంగా రఘునందన్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులే ప్రత్యక్ష దైవం అన్నారు. 


వ్యక్తులు ఎంత ఉన్నతికి చేరుకున్నా వారి ఔన్నత్యానికి దోహదపడిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల మార్గదర్శకాలను విద్యార్ధులు గుర్తుంచుకుంటారని అన్నారు. ఈసందర్భంగా బేగంపేట కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ జానకీ మాట్లాడుతూ పుత్రుల ఎదుగుదల తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్నిస్తుంది. తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉంటుందని అన్నారు. అలాగేఉపాధ్యాయులకు కూడా తమ విద్యార్ధులు గురువులను మించిన శిష్యులుగా ఎదిగితే ఎంతో సంతృప్తిని కలిగిస్తుందన్నారు. 25ఏళ్ల క్రితం తన వద్ద చదువుకున్నవారు తమనునేటికీ గుర్తుపెట్టుకుని వచ్చి ఆదరించడం చూస్తుంటే వారు భవిష్యత్తులో మరింత ఉన్నతదికి చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-09-06T01:03:29+05:30 IST