స్కూళ్లలో సరి-బేసి విధానం!

ABN , First Publish Date - 2020-05-09T10:23:05+05:30 IST

సరి-బేసి విధానాన్ని పాఠశాలల్లోనూ అమలు చేసే దిశగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్డీ), నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్టీ) ఆలోచిస్తున్నాయి

స్కూళ్లలో సరి-బేసి విధానం!

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): సరి-బేసి విధానాన్ని పాఠశాలల్లోనూ అమలు చేసే దిశగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్డీ), నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్టీ) ఆలోచిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా తీసుకునే చర్యల్లో భాగంగా అధికారులు ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.కరోనా ఇప్పట్లో తగ్గే  సంకేతాలు లేకపోవడంతోపలు జాగ్రత్తలు తీసుకుంటూ స్కూళ్లను కొనసాగించాలని ఆలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి రోజు కేవలం 50 శాతం మంది విద్యార్థులే హాజరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరి-బేసి ఆలోచన వచ్చింది. ఒక పాఠశాలలో 1-10 లేదా 1-12వ తరగతి వరకు ఉంటే ఒక రోజు సగం తరగతుల విద్యార్థులు, మరో రోజు మిగతా సగం తరగతుల విద్యార్థులు వచ్చేలా ఆలోచన చేస్తున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం సాధ్యమవుతుంది. ఎంహెచ్‌ఆర్డీ, ఎన్‌సీఈఆర్టీ ఈ ఆలోచనను అమలు చేస్తే ముందుగా సీబీఎ్‌సఈ, కేంద్రీయ, నవోదయ పాఠశాలల్లో అమలు చేస్తారు. ఇదే విధానాన్ని రాష్ట్రాలకు కూడా సూచించే అవకాశం ఉంది. సరి-బేసి విధానంలో భాగంగా ఇంటి వద్ద ఉండే విద్యార్థుల సమయం వృథాకాకుండా వారికోసం ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు  ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

Updated Date - 2020-05-09T10:23:05+05:30 IST