ప్రభుత్వ స్థలాల కబ్జాపై విచారణ చేయాలి: సీపీఎం

ABN , First Publish Date - 2020-09-13T08:19:36+05:30 IST

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కాచవాని సింగారం, ఏదులాబాద్‌, ముత్వెల్లిగూడ,

ప్రభుత్వ స్థలాల కబ్జాపై విచారణ చేయాలి: సీపీఎం

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కాచవాని సింగారం, ఏదులాబాద్‌, ముత్వెల్లిగూడ, ప్రతాపసింగారం, చౌదరిగూడ, అవుషాపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల్లో ప్రభుత్వ భూముల కబ్జాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.


శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, భూకబ్జాదారులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. స్థానిక అఖిలపక్ష ప్రతినిధులు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలనకు పంపుతున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-09-13T08:19:36+05:30 IST