అక్టోబర్‌లో ‘నర్సింగ్‌’ తరగతులు: ఐఎన్‌సీ

ABN , First Publish Date - 2020-05-29T09:10:03+05:30 IST

అక్టోబర్‌లో ‘నర్సింగ్‌’ తరగతులు: ఐఎన్‌సీ

అక్టోబర్‌లో ‘నర్సింగ్‌’ తరగతులు: ఐఎన్‌సీ

హైదరాబాద్‌, మే 28(ఆంధ్రజ్యోతి): నర్సింగ్‌ కోర్సుల తరగతులను అక్టోబర్‌లో ఆన్‌లైన్‌లో నిర్వహించాలని రాష్ట్రాలకు ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌(ఐఎన్‌సీ) సూచించింది. ఆన్‌లైన్‌లో థియరీ తరగతులను నిర్వహించాలని, ప్రాక్టికల్‌ తరగతులపై లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నర్సింగ్‌ కోర్సుల తరగతుల ప్రారం భం, పరీక్షల నిర్వహణపై ఐఎన్‌సీ ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసిం ది.  ఈ విద్యాసంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని, వారు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని తెలిపింది.

Updated Date - 2020-05-29T09:10:03+05:30 IST