వీఆర్‌ఓ, వీఆర్‌ఏల సంఖ్య తేల్చండి: సీసీఎల్‌ఏ
ABN , First Publish Date - 2020-03-08T09:33:34+05:30 IST
రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) సంఖ్య తేల్చాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) జిల్లా కలెక్టర్లను

హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) సంఖ్య తేల్చాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీఆర్‌ఓలు 6,683 మంది ఉండాల్సి ఉండగా 7,039 మంది, వీఆర్‌ఏలు 23,046 మంది ఉండాల్సిన చోట 24,035 మంది ఉన్నారని గుర్తు చేశారు. ఆర్థిక శాఖ పోర్టల్‌లో వివరాలు సరిచేయడానికి వీలుగా పూర్తి వివరాలు స్పష్టంగా పంపించాలని ఆయన సూచించారు.