2,602! జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల సంఖ్య

ABN , First Publish Date - 2020-11-21T08:48:52+05:30 IST

మహా పోరులో నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఆఖరి రోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పార్టీల తరఫున, స్వతంత్రులు

2,602! జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల సంఖ్య

గ్రేటర్‌ ఎన్నికల్లో నామినేషన్ల సంఖ్య

బీజేపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి అత్యధికం


పార్టీలవారీగా నామినేషన్లు

బీజేపీ- 571;

టీఆర్‌ఎస్‌- 557;

కాంగ్రెస్‌- 372;

టీడీపీ- 206; ఎంఐఎం- 78;

సీపీఎం- 22; 

సీపీఐ - 21;

స్వతంత్రులు - 650


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహా పోరులో నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఆఖరి రోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పార్టీల తరఫున, స్వతంత్రులు శుక్రవా రం 1,412 మంది 1,937 నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,932 మంది 2,602 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా బీజేపీ నుంచి 571, టీఆర్‌ఎస్‌ నుంచి 557; కాంగ్రెస్‌-372, టీడీపీ నుంచి 206 నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు బీజేపీ 129 డివిజన్లకే అభ్యర్థులను ఖరారు చేయగా.. దాదాపు అన్ని డివిజన్ల నుంచి ముగ్గురు నలుగురు నామినేషన్లు వేశారు. అధికార టీఆర్‌ఎ్‌సలోనూ అదే పరిస్థితి. టీడీపీ 90 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. 206 నామినేషన్లు పడ్డాయి. కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలోని ఆరు డివిజన్ల నుంచి 119 మంది 146 నామినేషన్లు వేశారు. గోషామహల్‌ సర్కిల్‌ పరిధిలోని ఆరు డివిజన్ల నుంచి 118 మంది 155 నామినేషన్లు వేశారు.

Read more