నుమాయిష్ జరుగుతుందా..? లేదా..?
ABN , First Publish Date - 2020-12-30T13:50:22+05:30 IST
కరోనా నేపథ్యంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్ : కరోనా నేపథ్యంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రారంభంపై బుధవారం ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సమావేశం కానుంది. నుమాయి్‌షను ఎప్పుడు ప్రారంభించాలి.., ప్రభుత్వం నుంచి ఏ మేరకు అనుమతి వస్తుంది.., అనే అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ఆ నివేదికను సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్‌కు సభ్యులు అందజేయనున్నారు. దీనిపై ఈ నెల 31న మైదానంలో ఈటల రాజేందర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తారని కమిటీ పేర్కొంది.