20 వేల కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సాయం

ABN , First Publish Date - 2020-05-09T10:01:33+05:30 IST

లాక్‌డౌన్‌ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 20 వేల పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించినట్లు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు

20 వేల కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సాయం

హైదరాబాద్‌, మే 8(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో  ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 20 వేల పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించినట్లు  మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.  బియ్యం, కూరగాయలు, వంట నూనె, పండ్లు, కోడి గుడ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు.  అలాగే 3 వేల మంది రోజువారీ కూలీలు, వలస కార్మికులకు పులిహోర, బిస్కట్‌ ప్యాకెట్లు అందించామన్నారు. రెండున్నర లక్షల ఎస్‌ఎస్‌99 మాస్‌లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ దేశంలో ప్రజల జీవనోపాధిని కోల్పోయేలా చేసిందని ఆమె విచారం వ్యక్తం చేశారు. ట్రస్ట్‌ బ్లడ్‌బ్యాంక్‌ ద్వారా రెండు రాష్ట్రాల్లోని వివిధ ఆస్పత్రుల్లో  అత్యవసర చికిత్స పొందుతున్నవారికి, తలసేమియా బాధితులకు 5 వేల యూనిట్ల బ్లడ్‌ అందజేసినట్లు  చెప్పారు. సంక్షోభ సమయంలో పేదలకు  సేవ చేయడానికి ట్రస్ట్‌ ఎప్పుడూ ముందుంటుందని ఆమె అన్నారు.

Updated Date - 2020-05-09T10:01:33+05:30 IST