మూడు ఆస్పత్రులపై విచారణ చేపట్టండి

ABN , First Publish Date - 2020-08-20T09:34:38+05:30 IST

మూడు ఆస్పత్రులపై విచారణ చేపట్టండి

మూడు ఆస్పత్రులపై విచారణ చేపట్టండి

  • రాష్ట్ర డ్రగ్‌ కంట్రోలర్‌కు ఎన్‌పీపీఏ లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కరోనా రోగుల నుంచి అధిక చార్జీలను వసూలు చేశాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడు కార్పొరేట్‌ ఆస్పత్రులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్ర డ్రగ్‌ కంట్రోలర్‌కు నేషనల్‌ నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ(ఎన్‌పీపీఏ) సూచించింది. విజయ్‌ గోపాల అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేసిన ఎన్‌పీపీఏ.. ఆయా ఆస్పత్రులు కొన్ని ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించింది. తర్వాతి విచారణను కొనసాగించాలంటూ రాష్ట్ర డ్రగ్‌ కంట్రోలర్‌కు ఎన్‌పీపీఏ డిప్యూటీ డైరెక్టర్‌ మంజిత్‌ పొర్వాల్‌ లేఖ రాశారు.

Read more