సారూ..పాత పింఛను పథకంను పునరుద్ధరించరూ

ABN , First Publish Date - 2020-10-03T22:47:56+05:30 IST

కొత్త పింఛన్ పథకం ను రద్దు చేసీ పాత పింఛను పథకం ను పునరుద్ధరించే వారికే రాజ్యాధికారం దక్కుతుందని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్దరణ కోసం రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం అవుతుందని

సారూ..పాత పింఛను పథకంను పునరుద్ధరించరూ

హైదరాబాద్: కొత్త పింఛన్ పథకం ను రద్దు చేసీ పాత పింఛను పథకం ను పునరుద్ధరించే వారికే రాజ్యాధికారం దక్కుతుందని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్దరణ కోసం రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం అవుతుందని భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీ ఎస్) శ్రేణులు ట్విట్టర్ వేదికగా తమ ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య  కోసం ఆనాడు చేసిన సత్యాగ్రహం లా ఉప్పెన గా మారే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. ఎన్పీ ఎస్ క్విట్ ఇండియా అన్న నినాదం తో శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు కోటి మంది కి పైగా దేశ వ్యాప్త కొత్త పెన్షన్ పథకం ఉపాధ్యాయ ఉద్యోగ శ్రేణులు తమ తమ సంఘాలు, సమాఖ్య ల సాయంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమత్రులకు, దేశ ప్రధానికి నేరుగా ట్వీట్ చేసి ఆందోళన తీవ్రత ను వ్యక్తం చేశారన్నారు.

Updated Date - 2020-10-03T22:47:56+05:30 IST