నెలలోపే నోటిఫికేషన్లు ఇవ్వాలి: కోదండరాం

ABN , First Publish Date - 2020-12-15T22:55:26+05:30 IST

చిత్తశుద్ధి ఉంటే నెలలోపే నోటిఫికేషన్లు ఇవ్వాలని టీజేఎస్ అధినేత కోదండరాం డిమాండ్ చేశారు. తనను తాను రక్షించుకోవటానికే

నెలలోపే నోటిఫికేషన్లు ఇవ్వాలి: కోదండరాం

హైదరాబాద్‌: చిత్తశుద్ధి ఉంటే నెలలోపే నోటిఫికేషన్లు ఇవ్వాలని టీజేఎస్ అధినేత కోదండరాం డిమాండ్ చేశారు. తనను తాను రక్షించుకోవటానికే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని, రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తునందునే ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని చెప్పారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన అంశాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేసీఆర్‌ మభ్యపెడుతున్నారని, ఉద్యోగాల భర్తీ జరుగుతోందని నమ్మకం లేదని కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. జోనల్ వ్యవస్థ తేలకుండా ఉద్యోగాలు భర్తీ చేయలేరని, కమిటీ పేరుతో కాలయాపన చేసే కుట్ర చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. 

Updated Date - 2020-12-15T22:55:26+05:30 IST