ఐదు గ్రామాల సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు

ABN , First Publish Date - 2020-12-27T05:09:21+05:30 IST

ఐదు గ్రామాల సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు

ఐదు గ్రామాల సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు

ములుగు కలెక్టరేట్‌, డిసెంబరు 26 : జిల్లాలోని ములుగు, గోవిందరావుపేట మండలాల్లోని ఐదు గ్రామపంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు కలెక్టర్‌ కృష్ణఆదిత్య రెండు రోజుల క్రితం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పల్లెప్రగతి కార్యక్రమంలో విధిగా చేపట్టాల్సిన శ్మశానవాటిక, సెగ్రిగేషన్‌ షెడ్లు తదితర పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా నాసిరకంగా పనులు చేయించారని పేర్కొంటూ ములుగు మండలం శ్రీనగర్‌, గోవిందరావుపేట మండలం బాలాజీనగర్‌, బుస్సాపూర్‌, పాపయ్యపల్లి, మొట్లగూడెం సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు కలెక్టర్‌ ఈ నోటీసులను జారీ చేశారు. ఏడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని, లేనిపక్షంలో పంచాయతీరాజ్‌ చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Updated Date - 2020-12-27T05:09:21+05:30 IST