నేటి నుంచి ఈశాన్య రుతుపవనాలు!
ABN , First Publish Date - 2020-10-28T06:51:59+05:30 IST
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో నిష్క్రమించడంతో... బుధవారం నుంచి ఈశాన్య రుతుపవనాలు రంగప్రవేశం చేస్తున్నాయి.

హైదరాబాద్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో నిష్క్రమించడంతో... బుధవారం నుంచి ఈశాన్య రుతుపవనాలు రంగప్రవేశం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బుధవారం నుంచి నిష్క్రమిస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఆ వెంటనే తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలతోపాటు తెలంగాణలో ఈశాన్య రుతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద ఈశాన్య రుతుపవనాల ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండే అవకాశం లేదు.