రేపటి నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-11T03:14:38+05:30 IST

మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రభుత్వాన్ని హైకోర్టు మందలించింది.

రేపటి నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం

హైదరాబాద్:  మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రభుత్వాన్ని హైకోర్టు మందలించింది. దీంతో  రేపటి నుంచి తెలంగాణలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి  సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ధరణిలో నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ సాంకేతిక సమస్యలతో  రిజిస్ట్రేషన్లు మొదలు కాలేదు. రిజిస్ట్రేషన్లు ప్రక్రియ అలాగే ఉండిపోయింది. దీంతో ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. ఈమేరకు  ప్రభుత్వం పాత పద్ధతిలోనే  రిజిస్ట్రేషన్లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టింది.

Updated Date - 2020-12-11T03:14:38+05:30 IST