ఆసరా.. ఆలస్యం..కొత్తగా 3,426 దరఖాస్తులకు మోక్షం

ABN , First Publish Date - 2020-03-18T11:13:16+05:30 IST

అన్నీఉన్నా అల్లుడి నోట్ల శనిలా ఉంది ఆసరా పథకం పరిస్థితి. ఒక పక్క అర్హులైన ప్రతీ ఒక్కరికి పథకం వర్తింపచేస్తున్నామని నేతలు గొప్పలు చెప్పుకుంటుండగా, మరోపక్క నిధుల్లేక కొత్త వాటికి మోక్షం

ఆసరా.. ఆలస్యం..కొత్తగా 3,426  దరఖాస్తులకు మోక్షం

ఏడాది దాటినా డబ్బులు ఇవ్వని సర్కారు


ఆంధ్రజ్యోతి, వరంగల్‌ రూరల్‌

అన్నీఉన్నా అల్లుడి నోట్ల శనిలా ఉంది ఆసరా పథకం పరిస్థితి. ఒక పక్క అర్హులైన ప్రతీ ఒక్కరికి పథకం వర్తింపచేస్తున్నామని నేతలు గొప్పలు చెప్పుకుంటుండగా, మరోపక్క నిధుల్లేక కొత్త వాటికి మోక్షం లభించడం లేదు. జిల్లాలో 3,426 కొత్త ఆసరా పెన్షన్లకు అనుమతిలిచ్చిఎనిమిదినెలలు గడుస్తున్నా లబ్ధిదారులకు డబ్బులు రావడం లేదు. జిల్లాలో ప్రస్తుతం 94,344 మందికి ఆసరా పథకం కింద పెన్షన్ల ను ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కొత్తగా పెన్ష న్‌ కావాలంటూ వేలలో దరఖాస్తులు చేసుకున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులతోపాటుగా వితంతులు కూడా తమకు పెన్షన్‌ కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. 1,094 మంది దివ్యాంగులు, 51 మంది ఒంట రి మహిళలు, 687 వృద్ధులు, 105 మంది గీ త కార్మికులు, 30 మంది చేనేత, 1,455 వితం తులు కలిపి మొత్తం3,426 మంది పింఛన్లు ఇచ్చేందుకు జిల్లా అధికారులు అనుమతించారు. గత ఏడాది నుంచి డబ్బులు మాత్రం జమకావడం లేదని అర్హులు వాపోతున్నారు.  ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతోనే కొత్త పెన్షన్లకు డబ్బులు రావడం లేదని తెలుస్తోంది. అర్హులైన వారికి పింఛన్లు అందజేయాలని గ్రామాల్లో ఎమ్మెల్యేలు తిరుగుతున్న సమయంలో లబ్ధిదారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం ప్రస్తుతం నెలకు రూ.21.40 కోట్లను వ్యయం చేస్తున్నారు. కొత్తగా పెన్షన్లు ఇవ్వా లంటేమరో ఐదుకోట్ల వరకు నిధులను వెచ్చించాల్సి రావడంతో ప్రస్తుతానికి డబ్బులు వేయకుండా నాన్చుతున్నారనే చర్చ సాగుతోంది.


పింఛన్ల కోసం పడిగాపులు

ఆధారం లేని వారికి వరంలా మారిన ఆస రా పెన్షన్లను పొందడానికి లబ్ధిదారులు నానా తంటాలు పడుతున్నారు. పెన్షన్‌ దరఖాస్తుల ను నింపడం నుంచి వచ్చే వరకు మధ్యవర్తి ల ద్వారా చేతి చమురు వదలించుకుంటేనే మోక్షం లభించే పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో మంజూరు చేసే అధికారం లేకపోవడంతో మండల కార్యాలయం, ఆ తర్వాత కలె క్టర్‌ కార్యాలయం చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి నెలకొంది. పెన్షన్‌ ఇప్పించాలంటూ నిత్యం ప్ర జాప్రతినిధుల దగ్గరికి క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి పెన్షన్ల కోసం దర ఖాస్తులు వస్తుండడంతో మండలానికే వెళ్లా లంటూ బోర్డులను పెట్టారు. ఎమ్మెల్యేలు సై తం అర్హులైన వారికి పెన్షన్లు ఇప్పించాలం టూ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. 


ఆగస్టు నుంచి పెండింగ్‌లోనే..

జిల్లాలో 3,426 దరఖాస్తులకు ఆన్‌లైన్లో మోక్షం లభించినా డబ్బులు రావడం లేదు. గత ఏడాది ఆగస్టు నుంచి మండల, జిల్లా స్థాయిలో మంజూరైనా దరఖాస్తులకు డబ్బు లు రావడం లేదు. 2019 ఆగస్టు నుంచి మార్చి 2020వరకు దరఖాస్తులన్నీ కూడా పెం డింగ్‌లోనే ఉన్నాయి. అసలు కారణంగా కొత్త వాటికి బడ్జెట్‌ లేకపోవడంతోనే అన్నీ కార్యాలయాల్లో పెండింగ్‌లోనే దరఖాస్తులను చూపెడుతున్నారు. 


94వేల పింఛన్లు..

జిల్లాలో ఆసరా పెన్షన్లు 94వేలకి చేరాయి. కొత్త దరఖాస్తులను కలిపితే లక్ష దాటే అవ కాశముంది. ప్రస్తుతం జిల్లాలో 94,344 పెన్షన్లుండగా వృద్ధాప్యం 36,321, వితంతువులు 35,221, దివ్యాంగులు 13,576, టాడీ టాపర్స్‌ 3,257, చేనేత 1,500, ఒంటరి మహిళలు 2,4 23, బీడి వర్కర్స్‌ 2,046  పెన్షన్లు ప్రస్తుతం ఇస్తున్నారు. వీటి కోసం ప్రతీ నెలా రూ.21.40 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు డబ్బులు విడుదల చేస్తే మరో రూ.5కోట్లు అదనంగా ఇవ్వాల్సి ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆర్థిక మం దగమనంతో కొత్తవాటికి నిధులను విడుదల చేయనట్టు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా నిధులకు మోక్షం లభిస్తుందో లేదో చెప్పలేమని అధికారులంటున్నారు.

Updated Date - 2020-03-18T11:13:16+05:30 IST