ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్‌

ABN , First Publish Date - 2020-03-19T09:10:13+05:30 IST

సీఎం కేసీఆర్‌ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా

ఎమ్మెల్సీ అభ్యర్థిగా  కవిత నామినేషన్‌

భర్త, వేద పండితుల ఆశీస్సులు 

తీసుకొని నిజామాబాద్‌కు

తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

కవిత సేవలు రాష్ట్ర స్థాయిలో విస్తరించాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌

 

నిజామాబాద్‌/హైదరాబాద్‌/జగిత్యాల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా నిజామాబాద్‌కు చేరుకున్న కవిత.. మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాగా నిజామాబాద్‌కు బయలుదేరేముందు కవిత హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం తన నివాసంలో భర్త అనిల్‌రావు, వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన కవితకు మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ఎ.జీవన్‌రెడ్డి, షకీల్‌ అమీర్‌, కె.విద్యాసాగర్‌రావు, ఎంపీ సంతో్‌షకుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు.


కాగా కవిత శాసనమండలికే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో సేవలందించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. ఆమెకు ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అవకాశం కల్పించడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. టీఆర్‌ఎ్‌సకే చెందిన మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. బీజేపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతన్‌కర్‌ లక్మీనారాయణ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. 


రెండో మాట లేదు: కర్నె

ఎమ్మెల్సీగా కవిత అభ్యర్థిత్వం విషయంలో రెండో మాటే లేదని మండలిలో ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఆమెను అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి  అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్లో కర్నె ప్రభాకర్‌ విలేకరులతో మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల తర్వాత కవిత సేవలు లేకపోవడంపై నిజామాబాద్‌లో ప్రతిపక్షాలు కూడా పశ్చాత్తాపపడిన సందర్భాలున్నాయని తెలిపారు. ఆమె సేవలు ఆ జిల్లాకు, తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నాయన్నారు.

Updated Date - 2020-03-19T09:10:13+05:30 IST